లండన్: అమృత్సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ 787-8 విమానం శనివారం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అత్యవసర టర్బైన్ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) పని చేయడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. యూకేకు చేరుకున్న వెంటనే విమానాన్ని నిలిపివేసి పరీక్షలు జరిపారు.
బర్మింగ్‌హామ్‌లో విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యిందని, అన్ని ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ భాగాలు సాధారణంగానే పనిచేస్తున్నట్టు ఎయిర్ ఇండియా నిర్ధారించింది. రా ఎయిర్ టర్బైన్ వ్యవస్థ అనేది చిన్న ఫ్యాన్లాంటి పరికరం. ఇది విమానం శక్తిని కోల్పోయినప్పుడు స్వయం చాలకంగా వ్యవహరిస్తుంది.