Indian Origin | అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు (Shot Dead). పెన్సిల్వేనియా (Pennsylvania)లోని పిట్స్బర్గ్ (Pittsburgh)లో తన మోటెల్ బయట అతడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భారత సంతతి వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన 51 ఏళ్ల రాకేష్ ఎహాగబాన్ (Rakesh Ehagaban) రాబిన్సన్ టౌన్షిప్లో మోటెల్ (motel) నడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో మోటెల్ వెలుపల పార్కింగ్ వద్ద కాల్పుల శబ్దం వినబడటంతో రాకేష్ బయటకు వెళ్లాడు. అక్కడ గొడవ జరుగుతుండటాన్ని గమనించి ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో నిందితుడు స్టాన్లీ యూజీన్ వెస్ట్ (37).. రాకేష్ తలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు మోటెల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గత రెండు వారాలుగా రాకేష్ మోటెల్లోనే అద్దెకు దిగినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Mount Everest | మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది ట్రెక్కర్స్
Howrah Express | ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. మిర్యాలగూడలో నిలిచిన హౌరా ఎక్స్‌ప్రెస్
Wanaparthy | సతాయిస్తున్నదని.. రాడ్డుతో కొట్టి అత్తను చంపిన కోడలు