మిర్యాలగూడ: హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ (Howrah Express) రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది. ప్లాట్ఫామ్-1పై గంటకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. మరో ఇంజిన్ను తెప్పించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మిర్యాలగూడలో గంటసేపుగా నిలిచిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్
హౌరా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
మరొక ఇంజన్ తెప్పించేందుకు రైల్వే అధికారుల చర్యలు pic.twitter.com/SsrHTo77yj
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2025