Khalistani terrorist | సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. అయోధ్యలోని రామ మందిరం (Ram Mandir) సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 16, 17 తేదీల్లో ఆలయాలపై దాడి చేస్తామంటూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను పెకిలిస్తాం’ అంటూ హెచ్చరించారు. ఈ వీడియోలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు. మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్తాన్ దాడులకు దూరంగా ఉండాలని కెనడాలోని భారతీయులను కూడా పన్నూన్ హెచ్చరించాడు.
కాగా, పన్నూన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు ఇలాంటి హెచ్చరికలే చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో ప్రయాణించొద్దంటూ గత నెలలో వార్నింగ్ ఇచ్చాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్నూన్ తెలిపాడు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నాడు. ఇప్పుడు రామ మందిరం పునాదుల్ని పెకిలిస్తాం అని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
Also Read..
Supreme Court | పటాసుల నిషేధంపై ఢిల్లీ పోలీసులు సీరియస్గా లేరు : సుప్రీంకోర్టు
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?