Heavy Rainfall | కేరళ (Kerala) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD)అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మే 19 నుంచి 21వ తేదీ వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలివానతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక 19, 20 తేదీల్లో పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో అతి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించింది. అదేవిధంగా ఆ రెండు రోజులు తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మే 21వ తేదీన రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్జారీ చేసింది. ఆ తొమ్మిది జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ మాదిరిగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక నేడు పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Also Read..
Home Voting | ఇంటి నుంచే ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ
Bibhav Kumar | స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. బిభవ్ కుమార్ అరెస్ట్
Deve Gowda | నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోండి.. సెక్స్ స్కాండల్ కేసుపై దేవె గౌడ