Deve Gowda | నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోండి.. సెక్స్ స్కాండల్ కేసుపై దేవె గౌడ
Deve Gowda | తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని దేవె గౌడ (Deve Gowda) తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
Deve Gowda | కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ, మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసు (Karnataka Sex Scandal Case) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు 92వ పుట్టినరోజు జరుపుకుంటున్న దేవెగౌడ (Deve Gowda) తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై మాత్రం తప్పుడు కేసులు పెట్టారని మాజీ ప్రధాని ఆరోపించారు.
‘ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై నేను మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయాడు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడానికి మా నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. బాధిత మహిళలకు న్యాయం జరగాలి. నష్ట పరిహారం అందించాలి. నా కొడుకు హెచ్డీ రేవణ్ణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూశారు. ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది’ అని దేవె గౌడ అన్నారు.
ఈ కేసు గురించి హెచ్డి కుమారస్వామి తమ కుటుంబం మొత్తం తరపున మాట్లాడారని దేవె గౌడ తెలిపారు. జరిగినదంతా పరిశీలిస్తే తమ కుటుంబం పరువు తీసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరిగినట్లు అనిపిస్తోందన్నారు. ఈ కుట్రలో చాలా మంది ప్రమేయం ఉందని వారి పేర్లను ప్రస్తావించదల్చుకోలేదని దేవె గౌడ పేర్కొన్నారు. ఎవరి ప్రమేయం ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ‘దేవరాజే గౌడ ఏం మాట్లాడారో మీడియాలో చూశాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కుమారస్వామి వీటన్నింటిపై చురుగ్గా స్పందిస్తున్నారు. అన్ని విషయాలపై ఆయనే మాట్లాడతారు. ఈ సమయంలో నేను ఏమీ వ్యాఖ్యానించలేను’ అని దేవె గౌడ అన్నారు.
Also Read..
Mallareddy | సుచిత్ర వద్ద భూ వివాదం.. మల్లారెడ్డితో గొడవకు దిగిన 15 మంది
Swati Maliwal | కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతి మలివాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. తాజా వీడియో
Taiwan parliament | రణరంగంగా తైవాన్ పార్లమెంట్.. పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

