Swati Maliwal | కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపి స్వాతి మలివాల్‌పై దాడి అంతా డ్రామానేనా?.. తాజా వీడియో చూడండి
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది.
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీ నివాసంలో సెక్యూరిటీ సిబ్బందితో స్వాతి వాగ్వాదానికి దిగిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది.
ఈ వీడియోలో కేజ్రీవాల్ నివాసంలో నుంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు కనిపించింది. ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఆమె కూల్‌గానే ఉన్నారు. ఎక్కడా దెబ్బలు తగిలినట్లు కనిపించడం లేదు. చాలా మామూలుగానే నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం అక్కడ ఉన్న పోలీసులతో ఆమె మాట్లాడారు. ఈ వీడియోని ఆప్ శనివారం ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీంతోపాటు కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు స్వాతి వెళ్తున్న వీడియోని కూడా ఆప్ పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె మెట్లు దిగుతూ కుంటుతూ కనిపించింది. ‘స్వాతి మలివాల్ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని ఈ వీడియో బట్టబయలు చేస్తుంది’ అంటూ వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.
కాగా, కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన 52 సెకన్ల సీసీటీ ఫుటేజ్ శుక్రవారం వైరల్ అయిన విషయం తెలిసిందే. వీడియోలో స్వాతి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు కనిపించింది. ఈ వీడియోపై స్వాతి మలివాల్ స్పందించారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ‘రాజకీయ హిట్‌మాన్’ తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించారు. అయితే, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది బయటపెట్టలేదు.
మరోవైపు కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్వాతి మలివాల్ కీలక విషయాలను వెల్లడించారు. ‘నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లినప్పుడు బిభవ్ కుమార్ నాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి ఏడెనిమిది సార్లు బలంగా కొట్టాడు. నన్ను లాగేయడంతో టేబుల్‌కు నా తల తగిలి కింద పడిపోయాను. కావాలని నా చొక్కా పైకి లాగాడు. నా చొక్కా గుండీలు ఊడిపోయాయి. నా కడుపు, పొత్తి కడుపు, ఛాతిపై తన్నాడు. నేను పీరియడ్‌లో ఉన్నానని, నొప్పి భరించలేకపోతున్నానని చెప్పినా వినకుండా దాడి చేశాడు.’ అని స్వాతి ఫిర్యాదు చేశారు. మరోవైపు, సీఎం నివాసంలోకి అనధికారికంగా ప్రవేశించేందుకు మలివాల్ యత్నించారని, తనను దూషించారంటూ ఆమెపై బిభవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
स्वाति मालीवाल के आरोपों की असलियत उजागर कर रहा है ये वीडियो 👇🏻 pic.twitter.com/dBkH5YhKdD
— AAP (@AamAadmiParty) May 18, 2024
Also Read..
Kyrgyzstan | కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస.. కేంద్రం అలర్ట్
Taiwan parliament | రణరంగంగా తైవాన్ పార్లమెంట్.. పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు
Kiara Advani | కేన్స్‌లో మెరిసిన రామ్ చరణ్ హీరోయిన్.. హై-స్లిట్ గౌనులో ఆకట్టుకున్న కియారా అద్వానీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

