Kiara Advani | ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్‌లను ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలు పోతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
లోరియల్ ప్యారిస్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరైన కియారా అద్వానీ కేన్స్‌లో వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన హై-స్లిట్ గౌనులో మెరిసిపోయింది. సింపుల్ మేకప్, పెద్ద చెవిపోగులతో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. అక్కడ ఫొటోషూట్‌కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ని కియారా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
Payal Rajput | ప్రభాస్ కోసం వంట చేసి ముద్దుగా తినిపిస్తా : పాయల్ రాజ్‌పుత్
Kyrgyzstan | కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస.. కేంద్రం అలర్ట్
Rishi Sunak: 120 మిలియన్ల పౌండ్లు పెరిగిన ప్రధాని రిషి సునాక్ ఆస్తులు