Kerala CM : కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ (Mail) వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు (Thampanuru) పోలీస్ స్టేషన్ (Police station) కు మెయిల్ పంపారు. క్లిఫ్ హౌస్ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయని ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు. దాంతో సీఎం నివాసంలోని సెక్యూరిటీ సిబ్బంది (Security staff), పోలీసులు (Police) అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేసి అది ఫేక్ ఈ-మెయిల్‌గా తేల్చారు.
బాంబు బెదిరింపు మెయిల్ రాగానే అధికారులు ముఖ్యమంత్రి నివాసాన్ని డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబు జాడ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా తనిఖీల సమయంలో సీఎం విజయన్, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన బెదిరింపు మెయిల్‌కు, తాజాగా వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.