Viral news | ఎలుకలు ఏకంగా 800 సీసాల లిక్కర్ తాగాయట..!
Viral news | మద్యం (Liquor) వ్యాపారులు లక్షల రూపాయల విలువ చేసే లిక్కర్‌ను మాయం చేశారు. ఎక్సైజ్ అధికారుల (Excise officials) తనిఖీల్లో విషయం బయటపడింది. లిక్కర్ ఏమైందని ప్రశ్నించిన అధికారులకు మద్యం వ్యాపారులు వింత సమాధానం చెప్పారు.
Viral news : మద్యం (Liquor) వ్యాపారులు లక్షల రూపాయల విలువ చేసే లిక్కర్‌ను మాయం చేశారు. ఎక్సైజ్ అధికారుల (Excise officials) తనిఖీల్లో విషయం బయటపడింది. లిక్కర్ ఏమైందని ప్రశ్నించిన అధికారులకు మద్యం వ్యాపారులు వింత సమాధానం చెప్పారు. ఎలుకలు (Rats) తాగడంవల్లే మద్యం మాయమైందని తెలిపారు. దాంతో కంగుతినడం అధికారుల వంతయ్యింది.
జార్ఖండ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నారు. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం బిజినెస్‌పై అజమాయిషీని ప్రైవేట్ లైసెన్స్‌దారులకు బదిలీ చేయనున్నారు. ప్రభుత్వంపై భారాన్ని తగ్గించడం కోసం, వ్యాపారంలో పారదర్శకత కోసం నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు జార్ఖండ్ సర్కారు తెలిపింది.
నూతన మద్యం పాలసీ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం స్టాక్ లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు మద్యం స్టాక్ లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ధన్‌బాద్ ఏరియాలో మద్యం స్టాక్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఏకంగా 800 సీసాల ఇండియా మేడ్ విదేశీ మద్యం మాయమైంది.
దీనిపై ధన్‌బాద్ మద్యం వ్యాపారులను వివరణ కోరగా.. లెక్కరాకుండాపోయిన 800 సీసాల మద్యాన్ని ఎలుకలు తాగాయని చెప్పారు. మద్యం సీసాల మూతలను కొరికేసి నేలపాలు చేశాయని ఆరోపించారు. దాంతో అధికారులు షాకయ్యారు. నమ్మశక్యంగా లేని సమాధానం చెప్పిన మద్యం వ్యాపారులకు చీవాట్లు పెట్టారు. మిస్సయిన స్టాక్ విలువకు సమానంగా ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.
Read More >>
ప్రియుడితో లేచిపోయిన భార్య.. విడాకులు తీసుకుని భర్త ఏం చేశాడంటే..!
నటుడు కోట శ్రీనివాస్‌రావు మృతికి ప్రధాని మోదీ సంతాపం
మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి..? : డీఎంకే సర్కారుపై నటుడు విజయ్ ఫైర్
తికమ్‌గఢ్‌లో కుండపోత వర్షం.. ఇళ్లలోకి చేరిన వరద నీరు.. Video
ఇద్దరు పనికిరాని బీజేపీ డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారు..? : తేజస్వి యాదవ్
బీహార్ ఓటర్ లిస్టులో బంగ్లా, నేపాల్, బర్మా దేశస్తులు..!
జేఎంఎం ఎక్స్ అకౌంట్ హ్యాక్.. హేమంత్ సోరెన్ పోస్టు
కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

