Viral video : సోషల్ మీడియా (Social Media) లో నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో కొన్ని కడుపుబ్బ నవ్వించేవి ఉంటే.. కొన్ని ఆలోచింపజేసేవి ఉంటాయి. కొన్ని భయపెట్టేవి ఉంటే.. కొన్ని బాధపెట్టేవి కూడా ఉంటాయి. తాజాగా ఓ పసివాడి వీడియో వైరల్ అవుతోంది. తల్లితో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఆ బుడ్డోడు బయటపెట్టిన కోరిక ఇంటర్నెట్ (Internet) లో వైరల్ కావడంతో.. ఏకంగా ప్రభుత్వమే స్పందించింది. రాష్ట్ర మంత్రి స్పందిస్తూ పసివాడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రానికి చెందిన శంఖు అనే బుడతడికి బిర్యానీ అంటే ఇష్టం. కానీ అతడు వెళ్లే అంగన్ వాడీలో ఉప్మా పెడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి దగ్గర శంఖు తల్లి అతడికి అన్నం తినిపిస్తుండగా అతడు తన కోరికను బయటపెట్టాడు. ‘నాకు బిర్నానీ (బిర్యానీ) కావాలి’ అని ముద్దుముద్దుగా చెప్పాడు. ‘ఎక్కడ..?’ అని తల్లి ప్రశ్నించగా ‘అంగన్ వాడీలో..’ అని చెప్పాడు. అంగన్వాడీలో ఉప్మా పెడుతున్నారని, అందుకు బదులుగా తనకు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని తల్లితో అన్నాడు.
ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను శంఖు తల్లి తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్టు చేశారు. దాంతో బిర్యానీ కావాలన్న శంఖు కోరిక నెటిజన్ల మనసు దోచుకుంది. పలువురు బిర్యానీ లవర్స్ శంఖు కోరికకు ఫుల్ సపోర్ట్ చేశారు. బుడతడి క్యూట్ డిమాండ్‌పై నెటిజన్ల నుంచి ఊహించని స్పందన లభించడంతో ఆ వీడియో ఏకంగా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దాంతో కేరళ ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జి.. బుడ్డోడు శంఖు చేసిన అభ్యర్థనపై స్పందించారు.
శంఖు అభ్యర్థన నేపథ్యంలో అంగన్వాడీల్లో ప్రస్తుతం అమలవుతున్న మెనూను సమీక్షిస్తామని వీణా జార్జి చెప్పారు. బిర్యానీ కోసం అభ్యర్థించిన శంఖును, అతని తల్లిని మంత్రి మెచ్చుకున్నారు. పిల్లలకు అన్ని పోషకాలు అందేలా అంగన్వాడీల్లో ఆహారాన్ని అందిస్తున్నామని ఆమె చెప్పారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహకారంతో స్థానిక సంస్థలు అంగన్వాడీల్లో పాలు, గుడ్లు అందిస్తున్నాయని అన్నారు. శంఖు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని మెనూ సమీక్షిస్తామని చెప్పారు. అంటే పరోక్షంగా అంగన్వాడీ మెనూలో బిర్యానీకి చోటు కల్పించనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. పసివాడు శంఖు బిర్యానీ కావాలని అభ్యర్థించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
PM Modi | వికసిత్ భారత్ మా లక్ష్యం.. లోక్‌సభలో ప్రధాని ప్రసంగం
Maha Kumbh | మహా కుంభమేళాలో భూటాన్ రాజు.. యూపీ సీఎంతో కలిసి పుణ్య స్నానాలు
Delhi Elections | రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వం సిద్ధం చేసిన ఈసీ
BRS Whips | బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్
MLA Prashant Reddy | అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
MLA Talsani | ఇంతటి బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు : ఎమ్మెల్యే తలసాని
Harish Rao | ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?.. అసెంబ్లీ వాయిదాపై హరీశ్‌రావు ఆగ్రహం