e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News Article 370 : ఆర్టికల్‌ 370 రద్దుకు రెండేండ్లు

Article 370 : ఆర్టికల్‌ 370 రద్దుకు రెండేండ్లు

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దై ఇవ్వాల్టికి రెండేండ్లు పూర్తయ్యాయి. ఈ రెండేండ్ల కాలంలో కశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు 60 శాతం తగ్గిపోయాయి. రాళ్ల దాడి 87 శాతం మేర నమోదైంది. పర్యాటక వ్యాపారం 20 నుంచి 25 శాతానికి పెరిగింది. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే ప్రతిపాదనను పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు.

జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం కశ్మీర్‌లో కఠినమైన లాక్‌డౌన్ అమలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఆందోళనలకు తావిచ్చింది. కశ్మీర్‌కు చెందిన ఎందరో నేతలను గృహనిర్బంధంలో ఉంచి జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతత నెలకొనేలా చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఈ రెండేండ్లలో కశ్మీర్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొవిడ్ ఉన్నప్పటికీ పర్యాటకులు వస్తూనే ఉన్నారు. దాల్ సరస్సులో చాలా మంది పర్యాటకులు బోటు షికారు చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య 20 నుంచి 25 శాతం పెరుగడంతో 20 శాతం మందికి ఉపాధి అందివచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. శ్రీనగర్‌లోని ప్రసిద్ధ లాల్ చౌక్‌ వద్ద సీఆర్‌పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అయినప్పటికీ, మార్కెట్లలో ఎప్పటిమాదిరిగానే సందడి నెలకొన్నది. ఈ రెండేండ్లలో వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు తిరిగొచ్చిందని డ్రై ఫ్రూట్ షాప్ నిర్వహిస్తున్న బషీర్ అహ్మద్‌ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్‌ పాట.. ఎందుకంటే..?

చరిత్రలో ఈరోజు.. కశ్మీర్‌ స్వాధీనానికి పాక్‌ కుట్ర

అద్దెకు ప్రధాని అధికార నివాసం

ముక్కులో వెంట్రుకలు కట్‌ చేయొద్దా..? ఎందుకు..?

ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం

రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana