టోక్యో : పురుషుల హాకీ జట్టు 41 సంవత్సరాల తర్వాత పతకం సాధించి భారతదేశం క్రీడాభిమానులను సంతోషంలో ముంచెత్తింది. భారత్ విజయాన్ని హాకీ అభిమానులు దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నారు. ఈ విజయంపై బాలీవుడ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నది. ఇదే సమయంలో ఆహ్లాదకరమైన బాలీవుడ్ సినిమా పాట ఒకటి ఒలింపిక్స్‌లో వినిపించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ విభాగంలో బరిలో నిలిచిన ఇజ్రాయెల్‌కు చెందిన మహిళా స్విమ్మర్లు.. మాధురీ దీక్షిత్ పాట (Madhuri Dixit song) ‘ఆజ నాచ్ లే’ పాటను ప్రదర్శించారు.
టోక్యోలో డ్యూయెట్ టెక్నికల్ రొటీన్ ఫైనల్ ఈవెంట్ క్వాలిఫైయింగ్ రౌండ్లో ఇజ్రాయెల్ మహిళా స్విమ్మర్లు ఈడెన్ బ్లెచర్, షెల్లీ బొబ్రిస్కీ పోటీపడుతున్నారు. వారిద్దరూ మాధురీ దీక్షిత్ పాటపై అద్భుతమైన రిథమిక్ స్విమ్మింగ్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, ఈ వీడియో ఇంకా మాధురీ దీక్షిత్‌కు చేరుకోకపోవచ్చు. ఈ పాట ‘ఆజ నాచ్ లే’ చిత్రంలోనిది. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించగా.. అనిల్ మెహతా దర్శకత్వం వహించారు. మాధురితో పాటు కొంకణ సేన్ గుప్తా, అక్షయ్ ఖన్నా, జుగల్ హంసరాజ్, కునాల్ కపూర్ వంటి నటులు ఉన్నారు. అమెరికన్ కొరియోగ్రాఫర్ పాత్రను మాధురీ దీక్షిత్ పోషించింది.
మరోవైపు, సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోను ప్రశంసిస్తున్నారు. ఇజ్రాయెల్ స్విమ్మర్లకు కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ‘మా అభిమాన నటి మాధురీజీ నటించిన ఈ పాటను ప్రదర్శించినందుకు ఇజ్రాయెల్ స్విమ్మర్లకు ధన్యవాదాలు. ఇది చూడటానికి, వినడానికి చాలా సంతోషిస్తున్నాను’ అని ఒక నెటిజెన్ కామెంట్ రాశాడు. భారతీయ సంగీతంపై ఇజ్రాయెల్ కళాత్మక ఈత అని ఇంకొక నెటిజెన్ ప్రశంసించారు. అయితే, ఈ పోటీలో ఇజ్రాయెల్ స్విమ్మర్లు 15 వ స్థానంలో నిలిచారు. అయితేనేం.. భారతీయులకు ఈ ఇజ్రాయెల్ జంట మొదటి స్థానంలో ఉన్నది.
చరిత్రలో ఈరోజు.. కశ్మీర్ స్వాధీనానికి పాక్ కుట్ర
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..