Manja | బెంగళూరు : సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి మొదటి వారం నుంచే కైట్స్ ఎగరేస్తుంటారు. ఈ పతంగులను ఎగురవేసేందుకు మాంజా వినియోగిస్తుంటారు. అయితే జంతువులు, పక్షులకు, మనషులకు హానీకరం కలిగించే మెటల్ లేదా గ్లాస్ కోటెడ్ మాంజాపై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పతంగుల ఎగురవేతకు కేవలం కాటన్ థ్రెడ్ వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. గతంలో చైనా మాంజాపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఈ ఏడాది జంతు ప్రేమికుల విజ్ఞప్తుల మేరకు గ్లాస్ లేదా మెటల్ పౌడర్‌తో తయారు చేసే మాంజాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా మాంజాతో పాటు గ్లాస్ కోటెడ్ మాంజా వినియోగించడం వల్ల జంతువులు, పక్షులతో పాటు మనషుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశామని, ఈ నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
Bypolls | ఈసీ కీలక నిర్ణయం.. 14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల తేదీల్లో మార్పు