MK Stalin | తమిళ స్టార్ నటుడు విజయ్ దళపతి (Actor Vijay) రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం ( Tamilaga Vetri Kazhagam) పేరుతో పార్టీని ప్రకటించారు. గత నెల తొలిసారి భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆదివారం తమ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో 26 తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’, నీట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్టాలిన్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అబద్ధాలతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.
అయితే, విజయ్ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ (MK Stalin) తాజాగా స్పందించారు. ఎన్నికల హామీలను చాలా వరకూ నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని కొందరు వాదిస్తున్నారు. మేము చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాం. మిగిలిని ఒకటి లేదా రెండు త్వరలోనే అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో విజయ్‌పై స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కొత్త పార్టీలను ప్రారంభించే వారంతా డీఎంకే పతనం గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మాకు ఆందోళన లేదు. విమర్శలను మేం పట్టించుకోం. వారిని మాధానాలిచ్చి మా సమాయన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. ప్రజల ప్రయోజనం కోసం పనిచేయడమే మా పని. నాలుగేళ్ల ప్రభుత్వ విజయాల గురించి ఆలోచించాలని వారికి నేను వినమ్రంగా చెప్పాలనుకుంటున్నాను’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
The real Thalapathy TN CM #MKStalin attacks TVK Joseph Vijay.https://t.co/LsTfNm28bA
"All the new party starters are talking about the demise of DMK; we are not concerned about that; we don't want to waste our time answering them unnecessarily; in Anna's style, I say 'long live…— Manobala Vijayabalan (@ManobalaV) November 4, 2024
Also Read..
Air Pollution | లాహోర్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం.. భారత్‌ను నిందించిన పాక్ మంత్రి
Bus Accident | లోయలో పడిపోయిన బస్సు.. 30 మంది మృతి
Naga Chaitanya | నాగచైతన్య – శోభిత పెళ్లి వేదిక ఫిక్స్.. ఎక్కడో తెలుసా..?