Bus Accident | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో (passengers) వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
అల్మోరా జిల్లాలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదవశాత్తు బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి (Pushkar Singh Dhami) స్పందించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
#WATCH | Uttarakhand: A Garwal Motors Users’ bus fell into a gorge near Kupi in Ramnagar at Pauri-Almora border. Deaths and injuries feared. Search and rescue operation underway. Details awaited.
(Video: SDRF) pic.twitter.com/dzSgKw6tkF
— ANI (@ANI) November 4, 2024
Also Read..
Hindu Temple | కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. ట్రూడో ఏమన్నారంటే..?
Air Pollution | డేంజర్ బెల్స్.. ఢిల్లీలో 400 మార్క్‌ను దాటిన గాలి నాణ్యత
Kasthuri | సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే.. తెలుగు వారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు