Kasthuri | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి కస్తూరి (Kasthuri). తమిళనాడు బీజేపీ నాయకురాలైన కస్తూరి తాజాగా బీజేపీ సభలో ద్రావిడ సిద్దాంత వాదులను, వారి ఐడియాలజీని ప్రశ్నించే క్రమంలో తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ.. తెలుగు ప్రజలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. 300 ఏండ్ల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తెలుగు జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది.
ప్రస్తుతం తమిళనాడు ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు. ఇతరుల భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంచి మాటలు చెబుతున్నారు కాబట్టే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోందని కస్తూరి కామెంట్స్ చేసింది. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే