Naga Chaitanya | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఇక డిసెంబర్ 4వ తేదీన వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్.
అయితే, వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోనే చేసుకుంటారా..? అన్నదానిపై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి వేదికను నాగార్జున ఫిక్స్ చేసినట్లు తెలిసింది. టాలీవుడ్ సర్కిల్ నుంచి వచ్చిన సమాచారం మేరకు.. వీరి వివాహం హైదరాబాద్ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)లోనే జరగబోతోందని టాక్. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. సెట్టింగ్, డెకరేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిసింది. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు సమాచారం. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నట్లు తెలిసింది.
ఇక ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. వివాహానికి ముందు జరగాల్సిన సంప్రదాయ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. పెళ్లి తంతులో భాగంగా ఇటీవలే శోభిత నివాసంలో పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా సంప్రదాబద్ధంగా పూర్తి చేశారు. తన హల్దీ వేడుక కోసం కుటుంబ సభ్యులతో కలిసి వైజాగ్‌లోని తన ఇంట్లో పసుపు దంచుతున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
నాగచైతన్య ప్రస్తుతం చందూమొండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala).. లవ్ సితార అంటూ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read..
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!
BabyJohn | స్టన్నింగ్ కాప్‌గా వరుణ్ ధవన్.. హైప్ పెంచుతోన్న కీర్తిసురేశ్ బేబిజాన్ గ్లింప్స్
Kasthuri | సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే.. తెలుగు వారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు