BabyJohn | వరుణ్ ధవన్ (Varun Dhawan) లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ బేబీ జాన్ (Baby John). నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కామియో రోల్లో కనిపించబోతున్నాడు. Kalees డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
ఒకవేళ ఇది మొదలు అయితే.. రాబోయే భవిష్యత్‌ను ఊహించుకోండి.. అంటూ బేబిజాన్ (Baby John Taster Cut)ను షేర్ చేసింది కీర్తి సురేశ్. బేబి (చిన్నారి)వాయిస్ ఓవర్‌తో షురూ అయిన ట్రైలర్.. వరుణ్ ధవన్ స్టన్నింగ్ కాప్‌గా స్టైలిష్ అవతార్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తున్నాడు. సినిమాలో కీర్తిసురేశ్ గ్లామరస్‌గా కనిపించబోతున్నట్టు తాజా వీడియో చెబుతోంది. బేబి చుట్టూ తిరిగే సస్పెన్స్, థ్రిల్లింగ్ కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేసి బేబిజాన్పై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాడు డైరెక్టర్.
ఈ చిత్రంలో వామికా గబ్బి మరో హీరోయిన్గా నటిస్తోంది. బేబిజాన్ నుంచి ఇప్పటికే షేర్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినీ 1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
బేబిజాన్ Baby John Taster Cut..
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే