హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ప్రతి జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వీటిని హైవేలకు కనెక్ట్ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆర్ అండ్ బీశాఖ పనితీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద దవాఖానల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.