Air Pollution | దాయాది దేశం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్(Lahore)లో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమైంది. అక్కడ గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. స్థానిక అధికారుల ప్రకారం.. లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1,067 పాయింట్లు నమోదైంది. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నేటి నుంచి ప్రాథమిక పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో 50 శాతం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకూ వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేశారు. ప్రజలు సైతం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. తలుపులు, కిటికీలు సైతం మూసి ఉంచుకోవాలని సూచించింది. అదే సమయంలో ప్రజలు అనవసరమైన ప్రయాణాలు చేపట్టొద్దని సూచించింది.
అయితే తీవ్ర వాయుకాలుష్యం నేపథ్యంలో పాక్ అధికారులు భారత్‌ను నిందిస్తున్నారు. తమ దేశంలో వాయు కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. లాహోర్‌లో వాయు కాలుష్యానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్‌లోకి ప్రవేశిస్తోందని.. దీని కారణంగా ఏక్యూఐ లెవల్స్ దారుణంగా పడిపోయాయని మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు న్యూ ఢిల్లీతో చర్చలు జరపాలని అన్నారు.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
🌫️ The smog crisis in #Lahore is worsening, posing severe risks to public health. High pollution levels are causing respiratory issues, eye irritation, and even long-term health damage for residents. We need urgent action for cleaner air & sustainable policies to protect lives.… pic.twitter.com/Y3LJVPSXXv
— Mazhar (@TriconUmt) November 3, 2024
Lahore AQI hit 1900, World’s Most Polluted City
Pakistan blames Neighbour country for the severe pollution levels near the border.#Pakistan #pollution #smog #lahore #LahoreSmog pic.twitter.com/2S3hErIBbA
— Chaudhary Parvez (@ChaudharyParvez) November 4, 2024
Also Read..
Air Pollution | డేంజర్ బెల్స్.. ఢిల్లీలో 400 మార్క్‌ను దాటిన గాలి నాణ్యత
Indonesia | ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. తొమ్మిది మంది మృతి