Indonesia | ఇండోనేషియా (Indonesia)లో మరో అగ్నిపర్వతం బద్ధలైంది (volcano erupts). ఫ్లోర్స్ దీవి (Flores Island)లోని మౌంట్ లెవొటోబి లకిలకి (Mount Lewotobi Laki-laki) అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఈ అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతి రోజూ దాదాపు 2 వేల మీటర్ల ఎత్తున మందపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 : 57 గంటల సమయంలో ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు తెలిపారు. విస్ఫోటనాలు డేంజర్ జోన్‌ను దాటిపోయినట్లు పేర్కొన్నారు. అగ్నిపర్వతం వెదజల్లుతున్న వేడి బూడిద పడి సమీపంలోని పలు నివాసాలు మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సమీప గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ తీవ్రమైన మెరుపులతో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మేలో హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికిపైగా మరణించారు. సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించామన్నారు.
Also Read..
Rashmi Shukla | మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు..
Naga Chaitanya | నాగచైతన్య – శోభిత పెళ్లి వేదిక ఫిక్స్.. ఎక్కడో తెలుసా..?
Bus Accident | లోయలో పడిపోయిన బస్సు.. 30 మంది మృతి