Rashmi Shukla | మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు..
Rashmi Shukla | ఎన్నికలకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డీజీపీ రష్మీ శుక్లాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణం ఆదేశాలు అమలులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Rashmi Shukla | ఎన్నికలకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డీజీపీ రష్మీ శుక్లాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణం ఆదేశాలు అమలులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. రష్మీ శుక్లా స్థానంలో వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. రష్మీ శుక్లా స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
డీజీపీ నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ అధికారులు నిష్పక్షపాతంగా ఉండడంతో పాటు విధులను నిర్వర్తించే సమయంలో పక్షపాతంగా కనిపించకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అక్టోబర్ 259న రాజీవ్ కుమార్ మహారాష్ట్రలో రాజకీయ ప్రేరేపిత నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రష్మీ శుక్లాను ఆదేశించారు. ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. అక్టోబరు 12న బాంద్రా ఈస్ట్‌లో ముగ్గురు ముష్కరులు ఆయనను కాల్చి చంపిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

