Bypolls | ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల (Bypolls)పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీన పలు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల తేదీల్లో కీలక మార్పు చేసింది. మొత్తం మూడు రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలను వారం రోజులపాటూ వాయిదా వేసింది.
కేరళ (Kerala), పంజాబ్ (Punjab), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాల్లో 14 అసెంబ్లీ స్థానాలకు (14 Assembly constituencies) నవంబర్ 13న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోజున పలు మతపరమైన కార్యక్రమాల కారణంగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్జేడీ సహా పలు రాజకీయ పార్టీలు పోలింగ్‌ను వాయిదా వేయాలని ఈసీని కోరాయి. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. వారి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.
నవంబర్ 13న జరగాల్సిన ఉప ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభావితమైన 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేరళలోని పాలక్కాడ్, పంజాబ్‌లోని డేరా బాబా నానక్, చబ్బేవాల్, గిద్దర్ బాహా, బర్నాల్, యూపీలోని ఖైర్, మీరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, కర్హాల్, సిషామౌ, ఫుల్పూర్, కతేహరి, మజావాన్ ఉన్నాయి. అయితే, ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు.
Also Read..
Air Pollution | లాహోర్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం.. భారత్‌ను నిందించిన పాక్ మంత్రి
Indonesia | ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. తొమ్మిది మంది మృతి