బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. (Farmers Protest) హేమావతి ఎక్స్‌ప్రెస్ లింక్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చెపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలు మఠాలకు చెందిన వారు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ హేమావతి ఎక్స్‌ప్రెస్ లింక్ కెనాల్ ప్రాజెక్టును సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం చేపడుతున్నదని రైతులు ఆరోపించారు. హేమావతి కాలువ నీటిని పొరుగున ఉన్న బెంగళూరు దక్షిణ జిల్లాలోని రామనగర్‌కు మళ్లించాలనే ప్రభుత్వ ప్రణాళిక అశాస్త్రీయమని విమర్శించారు. తుమకూరు జిల్లాలోని పలు మండలాలకు ఈ ప్రాజెక్ట్ హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు బీ సురేష్ గౌడ, జీబీ జ్యోతి గణేష్‌తోపాటు ఆ పార్టీ నేతలు, పలు మఠాలకు చెందిన వారు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు రోడ్లపై టైర్లు కాల్చారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. కొందరు నిరసకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: