Kargil Vijay Diwas | కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) గుర్తు చేసుకున్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘భారత దేశ సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక ఈ కార్గిల్ దివస్. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భరతమాతను రక్షించే క్రమంలో ప్రాణ త్యాగం చేసిన ప్రతి సైనికుడికీ నేను నివాళులర్పిస్తున్నా. యుద్ధంలో వారు చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేం. ఆ పరాక్రమం నుంచి దేశ ప్రజలు స్ఫూర్తి పొందుతూనే ఉంటారు. జై హింద్.. జై భారత్’ అని ముర్ము ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, 1999 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారు.
Also Read..
Heavy Rain | ఢిల్లీలో భారీ వర్షం.. నదులను తలపిస్తున్న రహదారులు