JDU MLA : మణిపూర్ (Manipur) రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీరేన్ సింగ్ (Beiren Singh) నేతృత్వంలోని బీజేపీ సర్కారు (BJP government) కు మిత్రపక్షం జేడీయూ (JDU) షాకిచ్చింది. జేడీయూకు చెందిన ఏకైక ఎమ్మెల్యే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. మణిపూర్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్షం వైపు కూర్చున్నారు. ఈ పరిణామం మణిపూర్ రాజకీయాల్లో కలకలం రేపింది.
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు కీలక మిత్రుడిగా ఉన్న జేడీయూ మద్దతు ఉపసంహరించుకోనుందా అనే అనుమానాలు రేకెత్తాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 12 ఎంపీ సీట్లు సాధించి బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ ప్రధాన మిత్రపక్షంగా మారింది. ఈ నేపథ్యంలో మణిపూర్ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కానీ జేడీయూ అధిష్ఠానం అనుమతి కూడా తీసుకోకుండా ఆ పార్టీ మణిపూర్ ఎమ్మెల్యే బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నట్లు తేలింది.
దాంతో జేడీయూ హైకమాండ్ ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా 2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకుగాను బీజేపీ 32 స్థానాల్లో, జేడీయూ 6 స్థానాల్లో, ఎన్పీపీ 5 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో విజయం సాధించాయి. ఆ తర్వాత జేడీయూకు చెందిన ఆరుగురిలో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరారు. దాంతో జేడీయూకు ఏకైక ఎమ్మెల్యే మిగిలాడు. బీజేపీ బలం 37కు పెరిగింది.
Maoist Chalapathi | ఆమెతో దిగిన సెల్ఫీయే మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణం తీసిందట..!
Civils prelims | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది త
Civils prelims | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది తగ్గిన పోస్టులు
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
Dog revenge | ఢీకొట్టిన కారు యజమానిపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. Video viral