Dog revenge : సాధారణంగా కుక్కలకు (Dogs) విశ్వాసం ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి తినడానికి ఏదైనా పెడితే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి. కనిపించినప్పుడల్లా తోక ఆడిస్తూ విశ్వాసం చూపిస్తాయి. అయితే కోపం వస్తే కుక్కలు ప్రతీకారంతో కూడా రగిలిపోతాయని తాజాగా జరిగిన ఓ ఘటన స్పష్టం చేస్తోంది. తనను ఢీకొట్టిన కారు యజమాని (Car Owner) పై ఓ కుక్క ప్రతీకారం తీర్చుకుంది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని సాగర్ జిల్లా (Sagar district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లా కేంద్రంలోని తిరుపతిపురం కాలనీలో ప్రహ్లాద్ సింగ్ ఘోషీ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన తన కుటుంబంతో కలిసి కారులో బంధువుల వివాహానికి బయలుదేరాడు. ఆయన ఇంటికి 500 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడుకున్న కుక్కకు కారు తగిలింది. అయితే ఈ ఘటనలో కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు.
అయినా కారు తనకు తగలడంతో ఆ కుక్క ఆగ్రహించింది. కారు తనకు కనపడకుండా పోయేవరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. ఘోషి కుటుంబం వివాహానికి హాజరై అర్ధరాత్రి ఒంటిగంటకు ఇంటికి చేరుకుంది. వారు కారును ఇంటి ముందు పార్కు చేసి లోపలికి వెళ్లారు. ఉదయం లేచి తన కారును చూసుకున్న ఘోషి బిత్తరపోయాడు. ఎందుకంటే ఆ కారుపై అన్నీ గీతలే ఉన్నాయి.
ఆకతాయి పిల్లలు ఆ పనిచేసి ఉంటారని ఆయన ముందుగా భావించాడు. ఎవరు చేశారా అని తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి మళ్లీ షాకయ్యాడు. ఎందుకంటే కారుపై గీతలు పెట్టింది ఆకతాయి పిల్లలు కాదు. ఓ కుక్క. జనవరి 17న మధ్యాహ్నం ఘోషి ఢీకొట్టిన కుక్కే ఆ పని చేసింది. అర్ధరాత్రి ఘోషి కారు పార్కు చేసి ఇంట్లోకి వెళ్లగానే అప్పటికే ప్రతీకారంతో రగిలిపోతున్న కుక్క తన పని ప్రారంభించింది. ప్రతీకారంతో కుక్క కారుపై గీతలు పెట్టిన ఘటనను కింది వీడియోలో చూడవచ్చు.
📍 Madhya Pradesh | #Watch: Dog’s Revenge In Madhya Pradesh After Being Hit By Car Owner
Read more: https://t.co/yuaRCwr2LQ#Viral #MadhyaPradesh pic.twitter.com/hycjT406eJ
— NDTV (@ndtv) January 21, 2025
Delhi Elections | అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీలో ఆప్‌కు గట్టి షాక్..!
Encounter | సినీ ఫక్కీలో పోలీసుల ఛేజింగ్.. కారులో వెళ్తున్న దుండగుల కాల్చివేత.. Video
Maha Kumbh | గంగమ్మ తల్లి ఆశీస్సుల కంటే నాకు ఏదీ గొప్ప కాదు : గౌతమ్ అదానీ
Gautam Adani | మహా కుంభమేళాలో భక్తుల సేవలో గౌతమ్ అదానీ.. Video
Flying Past rehearsals | గణతంత్ర వేడుకల ముందు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్.. Videos