Maoist Chalapathi | ఆమెతో దిగిన సెల్ఫీయే మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణం తీసిందట..!
Maoist Chalapathi | తాజాగా ఆ ఎన్కౌంటర్తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చలపతి గతంలో చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఆయన ప్రాణం పోవడానికి కారణమైనట్లు తెలిసింది.
Maoist Chalapathi : మావోయిస్టు అగ్రనేత (Maoist top leader) చలపతి (Chalapati) ఈ నెల 20న ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి నాలుగు రోజులుగా కొత్తకొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఆ ఎన్కౌంటర్తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చలపతి గతంలో చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఆయన ప్రాణం పోవడానికి కారణమైనట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. 2016 మే నెలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల అనంతరం అక్కడ మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. పోలీసులు ఆ ఫోన్లోని సమాచారాన్ని జల్లెడపట్టారు. అందులో మావోయిస్టు అగ్రనేత చలపతి తన భార్య అరుణతో కలిసి దిగిన ఒక సెల్ఫీ కనిపించింది. దాంతో ప్రస్తుతం చలపతి రూపం ఎలా ఉంటుందనేది పోలీసులకు తెలిసిపోయింది.
ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు మావోయిస్టుల్లో చేరిన చలపతి ప్రస్తుత రూపురేఖలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం అప్పటిదాకా పోలీసులకు సవాల్ ఉండేది. అలాంటి సమయంలో పోలీసులు మొబైల్ దొరకడం బాగా ఉపయోగపడింది. ఆ సెల్ఫీనే రూ.1 కోటి రివార్డు కలిగిన చలపతిని పట్టుకునే దిశగా భద్రతా బలగాలను నడిపించింది. అయితే తన సెల్ఫీ పోలీసులకు దొరికిందని తెలిసినప్పటి నుంచి చలపతి అప్రమత్తమయ్యాడు. ఎక్కడికి వెళ్లినా తన వెంట పెద్ద సంఖ్యలో మావోయిస్టులను రక్షణగా తీసుకెళ్లేవాడు.
ఈ క్రమంలోనే జనవరి 20 తెల్లవారుజామున మరో 13 మంది మావోయిస్టులతో కలిసి చలపతి వెళ్తుండగా ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆయనను, ఆయనతోపాటు ఉన్న మావోయిస్టులు అందరినీ మట్టుబెట్టాయి. సెల్ఫీలో ఉన్న ఫొటోతో మరణించిన మావోయిస్టుల్లోని ఒక వ్యక్తి ముఖం సరిపోలడంతో అతను చలపతిగా పోలీసులు నిర్ధారించుకున్నారు.
వ్యూహరచనలో చలపతి దిట్ట
చలపతి అసలు పేరు రామ చంద్రారెడ్డి. ఆయనది ఉమ్మడి చిత్తూరు జిల్లా. 2008 ఫిబ్రవరి 15న ఒడిశాలోని నయాఘర్ జిల్లాలో భద్రతా బలగాలపై జరిగిన దాడికి అతనే సూత్రధారి. ఆ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి స్కెచ్ వేస్తే చలపతి వ్యూహాలు చాలా పకడ్బందీగా ఉండేవి. నయాగఢ్ దాడికి ముందు కూడా మావోయిస్టులు అడవి లోపలికి వచ్చే అన్ని రోడ్లపై పెద్దపెద్ద చెట్లను, కర్ర దుంగలను అడ్డుగాపడేశారు. ఆ తర్వాత భద్రతా బలగాలపై దాడికి పాల్పడి, అక్కడి నుంచి పారిపోయారు. భద్రతా బలగాలు రోడ్లపై ఉన్న చెట్లు, కర్ర దుంగలను తొలగించుకుంటూ అడవుల్లోకి వెళ్లేసరికి చలపతి టీమ్ జారుకుంది. కాగా అప్పట్లో ఆ దాడి చేయాలని చలపతిని ఆదేశించింది మావోయిస్టు అగ్రనేత, దివంగత రామక్రిష్ణ అని తదుపరి పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి..
Civils prelims | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది తగ్గిన పోస్టులు
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
Dog revenge | ఢీకొట్టిన కారు యజమానిపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. Video viral
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sruthi Hassan | ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ కామెంట్స్.. జాన్వీ కపూర్ విషయంలో మాత్రం సైలెంట్!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Nepal Earthquake | నేపాల్లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

