Asaduddin Owaisi : మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మసీదు కూల్చివేతపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. ‘ఇది ఒక రకమైన ఉగ్రదాడి’ అని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడి ప్రభుత్వం కారణంగానే మసీదులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. షిండే-బీజేపీ సర్కారు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు.
మనం ఒకవైపు విశ్వగురువుగా మారాలనుకుంటున్నామని చెప్పుకుంటూనే మరోవైపు మసీదులపై దాడులకు పాల్పడుతున్నామని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కచ్చితంగా ముస్లింలను, మతపరమైన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ‘ఇది మసీదులపై ఒకరకమైన ఉగ్రదాడి. అక్కడ షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం ఉన్నది’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
‘కేవలం ప్రభుత్వం కారణంగానే మహారాష్ట్రలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. షిండీ-బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నది. మనం ఒకవైపు విశ్వగురువు కావాలనుకుంటున్నాం. కానీ మరోవైపు మసీదులను కూల్చివేస్తున్నం. ఇవి కచ్చితంగా ముస్లింలను, వారి మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే’ అని ఆయన ఆరోపించారు.
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు.. మండిపడ్డ కేటీఆర్
Cyber Fraud | బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి రూ. 16.71 కోట్లు కొట్టేశారు
Pakistan | అచ్చుగుద్దినట్టు అనుకరిస్తున్నాడు.. పాక్లో యంగ్ బుమ్రా.. వీడియో
SBI | రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్.. వడ్డీరేట్లు 10 బేసిస్ పాయింట్లదాకా పెంపు
Janhvi Kapoor | అమ్మ కోరికను తీరుస్తున్న జాన్వి కపూర్..!