Alcohol Home Delivery | మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో త్వరలో లిక్కర్ హోమ్ డెలివరీ..!
Alcohol | ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్‌ను చెప్పాయి. త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ (low-alcohol drinks)ను హోమ్ డెలివరీ చేయనున్నాయి.
Alcohol | ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయమైపోయింది. ఫుడ్ నుంచి గ్రాసరీస్ వరకూ అంతా ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇదే ఆసరాగా చేసుకొని పలు ఆన్లైన్ సంస్థలు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేశిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్‌ను చెప్పాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ (low-alcohol drinks)ను హోమ్ డెలివరీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఈ సంస్థలు కొన్నేళ్ల క్రితం కేవలం ఫుడ్ మాత్రమే ఆన్లైన్లో డెలివరీ చేసేవి. ఆ తర్వాత కిరణా సరకులు, కూరగాయలు వంటికి కూడా సరఫరా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఆల్కహాల్ (Alcohol) ను కూడా డోర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ముందుగా ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారి కోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
2020 కరోనా సమయంలో లాక్డౌన్ విధించిన వేళ మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, అస్సాం ప్రాంతాల్లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించారు. అయితే అందుకు కొన్ని షరతులు విధించారు. ఇక ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ అనుమతి ఉన్న ఒడిషా, పశ్చిమబెంగాల్లో ఈ విధానం తీసుకురావడం వల్ల మద్యం అమ్మకాలు 20-30 శాతం పెరిగాయని నివేదికలు వెల్లడించాయి.
Also Read..
India – Russia | ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో మాట్లాడండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
Chandipura Virus | గుజరాత్లో చాందిపురా వైరస్ కలకలం.. ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృతి
Soldiers | జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకాలు.. 32 నెలల్లో 48 మంది జవాన్ల వీరమరణం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

