Soldiers | జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకాలు.. 32 నెలల్లో 48 మంది జవాన్ల వీరమరణం
Soldiers | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదుల (Terrorists) ఏరివేత కొనసాగుతోంది. దేశ రక్షణకై జవాన్లు (Soldiers) ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు.
Soldiers | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదుల (Terrorists) ఏరివేత కొనసాగుతోంది. దేశ రక్షణకై జవాన్లు (Soldiers) ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది జవాన్లు ఎదురు కాల్పుల్లో (Encounter) ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోమవారం కూడా జమ్మూలోని దోడా జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక అధికారి సహా నలుగురు భారతీయ ఆర్మీ సైనికులు మరణించారు.
దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు.
వారం రోజుల్లో జమ్ము రీజియన్‌లో ఇది రెండో పెద్ద ఎన్కౌంటర్. గతవారం కతువాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. ఇక తాజాగా మరణాలతో కలిపి గత 32 నెలల్లో జమ్మూ ప్రాంతంలో మృతిచెందిన మొత్తం ఆర్మీ సిబ్బంది సంఖ్య 48కి చేరుకున్నట్లు అధికారులు తాజాగా తెలిపారు.
ఇటీవలే జరిగిన దాడి ఘటనలు..
- ఈ ఏడాది జులై 16న (సోమవారం) దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఆర్మీ సైనికులు మరణించారు.
- అదేవిధంగా ఈ ఏడాది జూలై 8న కతువా జిల్లాలో మిలిటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
- జూన్ 11, 12 (2024) తేదీల్లో జరిగిన జంట దాడుల్లో ఆరుగురు సైనికులు గాయపడ్డారు.
- జూన్ 9వ తేదీన జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రియాస్ జిల్లా కొంతమంది భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బస్సు లోయలో పడిపోయింది. తొమ్మిది మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు.
- మే 4న (2024) పూంచ్ జిల్లాలో ఐఏఎఫ్‌కి చెందిన ఒక వాహనంతో సహా రెండు వాహనాలపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన ఒక సైనికుడు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
- గతేడాది డిసెంబర్ 21న జరిగిన ఉగ్రవాద చర్యలో నలుగురు సైనికులు మరణించారు.
- 2023 నవంబర్‌లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు మరణించారు.
- 2023 ఏప్రిల్-మే మధ్య జరిగిన జంట దాడుల్లో 10 మంది సైనికులు అమరులయ్యారు.
- 2022 మేలో కత్రాలో యాత్రికుల బస్సుపై దాడి చేయడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
- ఇక డిసెంబర్ 2021 చర్యలో నలుగురు సైనికులు మరణించారు.
Also Read..
Donald Trump | రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారు.. ఉపాధ్యకుడిగా ఎవరంటే..?
Donald Trump | దాడి ఘటన తర్వాత.. చెవికి బ్యాండేజ్‌తో తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చిన ట్రంప్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

