Donald Trump | అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా (Republican presidential candidate) ట్రంప్ పేరు ఖరారైంది.
సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ (Ohio Senator) 39 ఏళ్ల జేడీ వాన్స్ (J.D. Vance) పేరును ట్రంప్ ప్రకటించారు. బాగా ఆలోచించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.
కాగా, 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేటర్‌కు ఎన్నికయ్యారు. వాన్స్ ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. యేల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు కూడా. అంతేకాదు యేల్ లా జర్నల్‌కు సంపాదకుడిగా కూడా ఉన్నారు. సాంకేతిక, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా వాన్స్‌కు పేరుంది. వాన్స్.. ట్రంప్‌కు శత్రువు. మొదట్లో ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించేవాడు. ఆ తర్వాత మాజీ అధ్యక్షుడికి విధేయుడిగా మారారు. గతంలో మెరైన విభాగంలో అమెరికాకు ఆయన సేవలు కూడా అందించారు.
Also Read..
Mumbai Express way | ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఐదుగురు మృతి
Encounter | జమ్ములో ఎన్కౌంటర్.. ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం
Subramanian Swamy | మోదీ సారథ్యంలో టైటానిక్‌లా మునగనున్న బీజేపీ: మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి