Varalaxmi Sarathkumar | నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తన బాయ్‌ఫ్రెండ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్దేవ్ (Nicholai Sachdev)ని వరలక్ష్మి మనువాడింది. థాయ్‌లాండ్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇక వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నికోలై సచ్దేవ్ వరలక్ష్మిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. పెళ్లి తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తన పేరును మార్చుకోదని స్పష్టం చేశారు. అదేసమయంలో తాను, తన కుమార్తె వరలక్ష్మి పేరు పెట్టుకోనున్నట్లు వెల్లడించారు. ఇక ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ మాత్రం తాను కాదని చెప్పుకొచ్చారు.
నికోలై సచ్దేవ్ మాట్లాడుతూ.. ‘నాకు తమిళం రాదు అందుకు నన్ను క్షమించండి. తమిళంలో పొండటి (భార్య) అనే పదం మాత్రమే తెలుసు. ప్రస్తుతం నేర్చుకుంటున్నాను. ఇక నుంచి నా ఇల్లు ముంబై కాదు.. చెన్నై. మీకు ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నికోలై సచ్దేవ్. నాకు వరలక్ష్మి శరత్ కుమార్‌తో వివాహం అయ్యింది. అందరూ అనుకున్నట్లు పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును మార్చుకోదు. వరలక్ష్మి శరత్కుమార్లానే కొనసాగుతుంది. అయితే, నేను నా కూతురు తన పేరును తీసుకుంటున్నాం. ఇకపై నాపేరును నికోలై వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్‌గా (Nicholai Varalaxmi Sarathkumar Sachdev) మార్చుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.
అదేవిధంగా తాము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వరలక్ష్మి ఫస్ట్‌లవ్ తాను కాదని నికోలై తెలిపారు. ‘వరలక్ష్మి నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం. కానీ నేను తనకు ఫస్ట్ లవ్ కాదు. ఆమె ఫస్ట్ లవ్ సినిమాలే. ఆ తర్వాతే నేను. అందుకే పెళ్లి తర్వాత కూడా తను సినిమాల్లో నటిస్తుంది’ అని పేర్కొన్నారు.
కాగా, వరలక్ష్మి శరత్‌కుమార్ – నికోలై సచ్దేవ్ ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ నెల తొలి వారంలో చెన్నైలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమాలకు రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ రిసెప్షన్ తర్వాత వరలక్ష్మి – నికోలై జంట థాయ్‌లాండ్ వెళ్లింది. అక్కడ అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. పెళ్లి తర్వాత ఫొటోలను వరలక్ష్మి ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.
Also Read..
Donald Trump | దాడి ఘటన తర్వాత.. చెవికి బ్యాండేజ్‌తో తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చిన ట్రంప్
Donald Trump | రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారు.. ఉపాధ్యకుడిగా ఎవరంటే..?