Donald Trump | పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి (Trump attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే, ఈ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చారు (First Public Appearance). సోమవారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గాయమైన చెవికి బ్యాండేజ్‌తో కనిపించారు. అయితే 78 ఏళ్ల ట్రంప్ ఈ సదస్సుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆయన మద్దతుదారులు మాత్రం ట్రంప్‌ను చూడగానే చప్పట్లతో ట్రంప్‌కు స్వాగతం పలికారు. ‘యూఎస్ఏ.. యూఎస్ఏ..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారందరికీ ట్రంప్ అభివాదం చేశారు.
ఇక ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా (Republican presidential candidate) ట్రంప్ పేరు ఖరారైంది. పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ (Ohio Senator) 39 ఏళ్ల జేడీ వాన్స్ (J.D. Vance) పేరును ట్రంప్ ప్రకటించారు. బాగా ఆలోచించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.
Also Read..
Donald Trump | రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారు.. ఉపాధ్యకుడిగా ఎవరంటే..?
KTR | సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్