Cyber Fraud | బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి రూ. 16.71 కోట్లు కొట్టేశారు
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ఆన్లైన్ వేదికగా చెలరేగుతూ అమాయకులను అడ్డంగా దోచేస్తుండగా తాజాగా భారీ స్కామ్‌కు స్కెచ్ వేశారు.
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ఆన్లైన్ వేదికగా చెలరేగుతూ అమాయకులను అడ్డంగా దోచేస్తుండగా తాజాగా భారీ స్కామ్‌కు స్కెచ్ వేశారు. నోయిడా సెక్టార్ 62లో నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 16.71 కోట్లు కొట్టేశారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను తనిఖీ చేసే క్రమంలో బ్యాంక్ ఐటీ మేనేజర్ సుమిత్ శ్రీవాస్తవ ఈ దోపిడీని ఇటీవల గుర్తించారు.
ఆపై దర్యాప్తులో బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయిందని వెల్లడైంది. జూన్ 17 నుంచి జూన్ 21 మధ్య ఈ డబ్బును 84 వేర్వేరు ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు. దోపిడీని గుర్తించిన వెంటనే శ్రీవాస్తవ నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జులై 10న ఫిర్యాదు చేశారు. ఈ దోపిడీపై తదుపరి దర్యాప్తు విషయంలో బ్యాంక్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ( CERT-IN) సాయాన్ని కూడా కోరింది.
ఎన్సీఆర్బీ పోర్టల్‌లో ఇప్పటికే ఫిర్యాదు నమోదవగా, ఎఫ్ఐఆర్ మాత్రం జులై 10న నమోదైందని ఎస్హెచ్ఓ ఉమేష్ చంద్ర నైతాని వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ మేనేజర్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను దొంగిలించి చోరీ చేసిన నిధులను 89 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదలాయించారని సైబర్ నోయిడా ఏసీపీ వివేక్ రంజన్ రాయ్ వివరించారు.
Read More :
Pakistan | అచ్చుగుద్దినట్టు అనుకరిస్తున్నాడు.. పాక్‌లో యంగ్ బుమ్రా.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

