Pakistan | ఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఓ పిల్లాడు టీమ్ఇండియా ఏస్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ శైలిని అచ్చుగుద్దినట్టు అనుకరిస్తున్నాడు. సుమారు 10-12 ఏండ్ల వయసుండే ఈ చిన్నోడు.. బుమ్రా రనప్, బంతిని సంధించే విధానం, బాల్ డెలివరీ అయ్యాక అతడి హావభావాలను పొల్లుబోకుండా అనుకరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎత్తైన కొండల మధ్య ఉన్న ఓ ప్రదేశంలో గల్లీ క్రికెట్ ఆడుతున్న అతడి బౌలింగ్ శైలిని చూసి నెటిజన్లు ‘పాక్‌లో జూనియర్ బుమ్రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎక్స్’లో ‘యంగ్ బుమ్రా ఫ్రమ్ పాకిస్థాన్’ అని సెర్చ్ చేస్తే అందుకు సంబంధించిన వీడియో ప్లే అవుతుంది.
A young bowler trying to emulate @Jaspritbumrah93‘s bowling action. The video is viral on social media.pic.twitter.com/XF8J02BSwr
— Faizan Lakhani (@faizanlakhani) July 15, 2024