Janhvi Kapoor | అమ్మ కోరికను తీరుస్తున్న జాన్వి కపూర్..!
అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ కపూర్ పలు బాలీవుడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రీదేవికి తన కూతురు హిందీ సినిమాలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా నటించి పాపులర్ హీరోయిన్ గా ఎదగాలని చాలా కోరకగా ఉండేదట.
అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పలు బాలీవుడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రీదేవికి తన కూతురు హిందీ సినిమాలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా నటించి పాపులర్ హీరోయిన్ గా ఎదగాలని చాలా కోరకగా ఉండేదట. జాన్వీకపూర్ కూడా ఆ సమయం కోసం వేచి చూసేది. ఎట్టకేలకు తెలుగులో ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `దేవర`(Devara) సినిమాలో కథానాయకురాలిగా అంగీకరించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక రెండో సినిమాగా ఇటీవల రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో (RC 16) నూతన నిర్మాత కిలారు సతీష్ కుమార్ నిర్మించే చిత్రంలో కూడా జాన్వీకపూరే హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా బృందం ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో కన్నడ శివరాజ్ కుమార్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని అంటున్నారు. దీంతో పాటు విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రారంభమయ్యాయి.
జాన్వికపూర్ ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా ఒప్పుకుంది. హీరో నాని (Nani) సరసన ఓ చిత్రంలో నటించడానికి జాన్వీ అంగీరించింది. నాని హీరోగా నటించిన దసరా వంటి మాస్ బ్లాక్బాస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాకు దర్శకుడు. దసరా చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జాన్వీ కపూర్ తెలుగులో మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించబోతున్నదని తెలుస్తుంది. సో..తను టాలీవుడ్లో బిజీ కావాలన్న తన తల్లి శ్రీదేవి కోరిక జాన్వీకపూర్ ఇప్పుడు తీరుస్తుంది.
Read Also :
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్
Raj Tarun | 18లోపు విచారణకు రండి.. హీరో రాజ్‌తరుణ్‌కు నోటీసులు
Janhvi Kapoor | లెహంగాలో జాన్వీ పరువాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

