Raj Tarun | 18లోపు విచారణకు రండి.. హీరో రాజ్‌తరుణ్‌కు నోటీసులు
హీరో రాజ్ తరుణ్‌కు (Raj Tarun) నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా తాఖీదులిచ్చారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: హీరో రాజ్ తరుణ్‌కు (Raj Tarun) నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా తాఖీదులిచ్చారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు.
హీరో రాజ్‌తరుణ్, తాను పదకొండేండ్లుగా ప్రేమించుకుంటున్నామని, అనేకసార్లు శారీరకంగా కలిశామని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతూ, తనను మోసం చేయాలని చూస్తున్నాడని వాపోయింది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని లేకపోతే తనను చంపేస్తానంటూ, అతడి సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెల్లడించింది. గతంలో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని, రాజ్‌తరుణ్ కోసం తాను 45 రోజులపాటు జైలులో ఉన్నానని తెలిపింది. రాజ్‌తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్‌కు అలవాటుపడి అమ్మాయిలతో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ 4 పేజీల ఫిర్యాదును నార్సింగి పోలీసులకు అందజేసింది.
దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఏ 1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు అయ్యింది. ఈ నెల 13న లావణ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

