IRCTC Website Down | ధంతేరస్, దీపావళి (Diwali ), ఛఠ్‌పూజ (Chhath Puja).. ఇలా వరుస పండుగలు రావడంతో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. వారికి నిరాశే ఎదురైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శుక్రవారం ఉదయం తత్కాల్ టికెట్స్ బుకింగ్ సమయంలో ఈ సమస్య తలెత్తింది. సర్వర్ డౌన్ కావడంతో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు రైలు టికెట్స్ బుక్ చేసుకోలేకపోయారు. పండగల వేళ ఈ అంతారం ఏర్పడటంతో ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఐఆర్సీటీసీ డౌన్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లో ఎర్రర్ వస్తోందని పేర్కొంటున్నారు. కాగా, ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటీవలే కాలంలో తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహకానికి గురవుతున్నారు.
Also Read..
Terrorists Attack | అస్సాం ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి.. ముగ్గురు సైనికులకు గాయాలు
Dhanteras | అదృష్టాన్ని తెచ్చే ధంతేరస్.. బంగారంతోపాటూ ఇవి కూడా కొనుగోలు చేయొచ్చు..