Dhanteras | ధంతేరస్ (Dhanteras).. దీపావళి పండుగకు ముందు త్రయోదశి నాడు వస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధంతేరస్ పర్వదినం జరుపుకుంటారు. అందుకే ధంతేరస్ను ధనత్రయోదశి (Dhantrayodashi) అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 18న ధంతేరస్ వచ్చింది. ధంతేరస్తోనే దీపావళి పండుగ వేడుకలు మొదలవుతాయి. ఐదు రోజుల పాటు సాగుతాయి.
అంతేకాదు.. దీపావళికి ముందు వచ్చే ఈ త్రయోదశిని ధంతేరస్.. ధన త్రయోదశి.. చోటీ దీపావళి అంటారు. ధన త్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు పెంచే త్రయోదశి అని అర్థం. ధంతేరస్ నాడు ధన్వంతరికి, కుబేరుడితోపాటు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. దేవదానవులు సముద్ర మధనం చేస్తున్న వేళ.. ధన్వంతరి భగవానుడి చేతిలో కలశంతో దర్శనం ఆచ్చారని అంతా నమ్ముతారు. మరి కొన్ని చోట్ల అపమృత్యు నివారణ కోసం దీపాలను వెలిగించడం సంప్రదాయం.
ధనత్రయోదశినే కొన్ని ప్రాంతాల్లో ‘యమ త్రయోదశి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున సాయంత్రం భక్తులందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటి చుట్టూ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ పూజలో భాగంగా గోధుమ, పెసలు, మినుములు, కందులు, బార్లీ .. మొదలైన వాటిని అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే అపమృత్యు నివారణ కోసం నూనెతో దీపం వెలిగిస్తారు. దీనినే ‘యమదీపం’ అని కూడా అంటారు.
ఇక ధంతేరస్ను ధనలక్ష్మిని ఆరాధించే పవిత్రమైన రోజుగా అభివర్ణిస్తారు. భక్తుల కోరికలను తీర్చడానికి ‘అదృష్ట లక్ష్మి’ తనను పూజించే ప్రతి ఇంటికీ ఈ రోజు అతిథిగా విచ్చేస్తుందన్నది ఒక నమ్మకం. అందుకే ఈ పండుగ రోజు బంగారం, వెండి వంటి వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని ప్రజల విశ్వాసం. ధనత్రయోది రోజున కొంచెంకానీ బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు ప్రజలు. ఇక వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోవాలన్నా, నూతన వ్యాపార లావాదేవీలకు శ్రీకారం చుట్టాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ‘ధన్తేరస్’ అనువైన రోజగా భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధంతేరస్ను ‘అదృష్ట లక్ష్మి’ అతిథిగా వచ్చే రోజుగా భావిస్తారు.
ధంతేరస్ నాడు బంగారం, వెండి.. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తే కలిసిరావడంతోపాటు శుభప్రదం అని చెబుతారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ రోజు ఏం కొనుగోలు చేసినా రెట్టింపవుతుందని విశ్వాసం. అందుకే ఈ పర్వదినం నాడు బంగారం, వెండితోపాటుగా ఇంట్లోకి అవసరమైన ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు.
బంగారం, వెండి వస్తువులతోపాటు వెండి లక్ష్మి, గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేయవచ్చు. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. ఈ రోజు చీపురు కొనడంతో పేదరికం, కష్టాలు, అనారోగ్య సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ప్రతీతి. వాహనం కొనడం కూడా శ్రేయస్కరమే.
Also Read..
Gold prices | ధనత్రయోదశికి ముందు.. భారీగా పెరిగిన బంగారం ధర
Air Pollution | దీపావళికి ముందే ఢిల్లీలో డేంజర్ బెల్స్.. 350 దాటిన గాలి నాణ్యత సూచీ
Bihar Elections | మళ్లీ నితీశ్ కుమారే సీఎం..? అమిత్ షా ఏమన్నారంటే