Air Pollution | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీపావళి (Diwali) పండుగకు ముందే రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించింది. శుక్రవారం వరుసగా మూడో రోజు వాయు నాణ్యత సూచిక (AQI) చాలా పేలవమైన స్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 దాటింది.
అత్యధికంగా బావనా ప్రాంతంలో ఏక్యూఐ 367గా నమోదైంది. ఆనంద్ విహార్‌లో 276, చాందిని చౌక్‌లో 310, ద్వారకా సెక్టార్ 8లో ఏక్యూఐ 305గా, నెహ్రూ నగర్లో 269, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (టెర్మినల్ 3) వద్ద 221, రోహిణి ప్రాంతంలో 245, పూసాలో 224, ఇండిగా గేట్ పరిసర ప్రాంతాల్లో 200గా ఏక్యూఐ నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
Also Read..
Bihar Elections | మళ్లీ నితీశ్ కుమారే సీఎం..? అమిత్ షా ఏమన్నారంటే
Bomb Threat | ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులు