Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపుతున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలకు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) నివాసానికి కూడా ఇవాళ బెదిరింపులు వచ్చాయి.
చెన్నై (Chennai)లోని ఉపరాష్ట్రపతి నివాసానికి ఈ బెదిరింపులు వచ్చాయి. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు పెట్టినట్లు అందులో పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో దాన్ని నకిలీ బెదిరింపుగా తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్, ప్రముఖ నటులు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇళయరాజా స్టూడియోతోపాటూ చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, అవన్నీ నకిలీ బెదిరింపులుగా తేల్చారు.
Also Read..
PM Modi | మోదీ పాలనలో దేశం అస్తవ్యస్తం.. పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, యువశక్తి నిర్వీర్యం
Digital Arrest | వ్యాపారవేత్త డిజిటల్ అరెస్ట్.. 58 కోట్లు లూటీ