ముంబై: సైబర్ మోసగాళ్ల డిజిటల్ అరెస్ట్‌కు గురైన ముంబై వ్యాపారవేత్త (72) రూ.58 కోట్లు పోగొట్టుకున్నారు. అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితునితో సైబర్ మోసగాళ్లు ఆగస్టు19 – అక్టోబర్ 8 మధ్య మాట్లాడారు. తాము ఈడీ, సీబీఐ అధికారులమని చెప్పారు.
“మీ పేరు మనీలాండరింగ్ కేసులో ఉంద”ని బెదిరించారు. వీడియో కాల్ చేసి, ఆయనను, ఆయన భార్యను డిజిటల్ అరెస్ట్ చేశారు. వారి నుంచి 58 కోట్లు కాజేశారు.