Pakistan | భారత్‌పై పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి నోరు పారేసుకున్నారు. సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
ఓ టెలివిజన్ ఛానెల్‌తో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని విలేకరు ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ.. ‘ఖచ్చితంగా.. దాన్ని తోసిపుచ్చలేము. అందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. పాక్ విషయంలో ఆఫ్ఘాన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. సరిహద్దుల్లో భారత్ డర్టీగేమ్స్ ఆడుతోందని వ్యాఖ్యానించారు. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి ఇప్పటికే వ్యూహాలను రూపొందించినట్లు ఈ సందర్భంగా ఖవాజా ఆసిఫ్ తెలిపారు. అయితే, యుద్ధ వ్యూహాలను బహిరంగంగా చర్చించలేనంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా, ఖవాజా ఆసిఫ్ ఇప్పటికే భారత్ (India) తరఫున ఆఫ్గాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Donald Trump: ఒకవేళ దాడులు కొనసాగిస్తే.. హమాస్‌పై సైనిక చర్యే: ట్రంప్ వార్నింగ్
హెచ్1బీ వీసాదారుల… జీవిత భాగస్వామి కూడా పనిచేయొచ్చు!
అఫ్ఘాన్‌లో పాక్ సైనికుల ప్యాంట్ల ప్రదర్శన