కాబుల్: అఫ్ఘాన్-పాక్ సరిహద్దు ఘర్షణల అనంతరం పాక్ సైనికుల ప్యాంట్లను తాలిబన్లు బహిరంగంగా ప్రదర్శించారు. ఇరు దేశాలు 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఇది చోటు చేసుకుంది.
పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శనను తమ విజయంగా తాలిబన్ యోధులు జరుపుకున్నారు. ఘర్షణల సందర్భంగా సైనిక స్థావరాల నుంచి పాక్ సైనికులు పారిపోయినట్టు తెలుస్తున్నది. పాక్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాంకులను, ఆయుధాలను కూడా అఫ్ఘాన్ దళాలు ప్రదర్శించాయి. ఇది పాక్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.