Gold prices | బంగారం భగభగమండుతోంది (Gold prices). సామాన్యులను ఊరిస్తున్న పుత్తడి (Gold Rates).. సంపన్నులనూ సవాల్ చేస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఏకంగా రూ.1.40 లక్షల వైపుకు దూసుకెళ్తోంది.
ధనత్రయోదశి (Dhanteras)కి ఒక్కరోజు ముందు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.3 వేలకుపైనే పెరిగింది. ఫలితంగా తులం బంగారం రూ.1.35 లక్షలు దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ వర్గాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,250గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,725కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.1,81,000 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం వల్లనే దేశీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనుండటం, చైనా-అమెరికా మధ్య టారిఫ్‌లు కూడా ధరలు దూసుకుపోవడానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నాయి. మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
అంతేకాదు, రేపు (అక్టోబర్ 18) ధనత్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రదమని దేశంలోని మెజారిటీ ప్రజల విశ్వాసం. బంగారం కొనుగోలు చేస్తే సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆరోజు బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
Also Read..
Foxconn | తమిళనాడుకు తరలిన ఫాక్స్‌కాన్!.. తెలంగాణలో విస్తరణకు మొగ్గుచూపని తైవాన్ కంపెనీ
83 వేల పాయింట్లు పైకి సెన్సెక్స్