Cabinet Expansion | గుజరాత్ (Gujarat)లో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Expansion) చేపట్టింది. 26 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో నిర్వహించిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
#WATCH | Gandhinagar | Harsh Sanghavi takes oath as Deputy Chief Minister of Gujarat pic.twitter.com/rJ5fYP4utC
— ANI (@ANI) October 17, 2025
రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి (Harsh Sanghavi) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రివర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా (Rivaba Jadeja)కు కూడా చోటు దక్కింది. ఆమె కూడా ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తన కూతురుతో కలిసి హాజరయ్యారు.
#WATCH Gandhinagar | Gujarat Governor Acharya Devvrat, CM Bhupendra Patel, and BJP National President & Union Minister JP Nadda arrive at oath ceremony for Cabinet expansion pic.twitter.com/iC6lNX7iTH
— ANI (@ANI) October 17, 2025
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులంతా నిన్న మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వారి రాజీనామాలను ఆమోదించారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ నిన్న రాత్రి గవర్నర్ను కలిశారు. మంత్రుల రాజీనామాలను అధికారికంగా గవర్నర్కు సమర్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుల, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడం, ప్రభుత్వంలో కొత్త శక్తిని నింపేందుకు బీజేపీ విస్తృత వ్యూహంలో భాగంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Jadeja
Also Read..
Dhanteras | అదృష్టాన్ని తెచ్చే ధంతేరస్.. బంగారంతోపాటూ ఇవి కూడా కొనుగోలు చేయొచ్చు..
Gold prices | ధనత్రయోదశికి ముందు.. భారీగా పెరిగిన బంగారం ధర
Air Pollution | దీపావళికి ముందే ఢిల్లీలో డేంజర్ బెల్స్.. 350 దాటిన గాలి నాణ్యత సూచీ