Terrorists Attack | ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. తిన్సుకియా (Tinsukia) జిల్లాలోని కాకోపథర్ (Kakopathar)లో గల భారత ఆర్మీ శిబిరం (Assam Army camp)పై ఉగ్రదాడి జరిగింది (Terrorists Attack). గుర్తు తెలియని వ్యక్తులు గ్రెనేడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు (soldiers injured). ఈ దాడి వెనుక యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ దాడితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం చుట్టూ 2 నుంచి 3 కి.మీ మేర పరిధిని మూసివేసి పౌరుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు డూమ్డూమా దిశ నుండి ట్రక్కులో వచ్చి ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగించి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అనంతరం వారు అరుణాచల్ ప్రదేశ్ వైపు పారిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వారి కోసం భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టింది.
దాడికి ఉపయోగించినట్లు భావిస్తున్న ఓ ట్రక్కును పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని టెంగపాని ప్రాంతంలో దుండగులు విడిచి పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ట్రక్‌ను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. గురువారం అరుణాచల్ ప్రదేశ్‌లోని మన్‌మావ్‌లో అస్సాం రైఫిల్స్ దళాలపై ఉల్ఫా-ఐ తిరుగుబాటుదారులు మెరుపుదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే మరో దాడి జరగడం గమనార్హం.
Also Read..
Dhanteras | అదృష్టాన్ని తెచ్చే ధంతేరస్.. బంగారంతోపాటూ ఇవి కూడా కొనుగోలు చేయొచ్చు..
Gold prices | ధనత్రయోదశికి ముందు.. భారీగా పెరిగిన బంగారం ధర