శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 18:18:26

మోదీనగర్‌ ఘటనపై దర్యాప్తు జరపండి : సీఎం యోగి

మోదీనగర్‌ ఘటనపై దర్యాప్తు జరపండి : సీఎం యోగి

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌ జిల్లా మోదీనగర్‌ ప్రాంతంలోని బఖర్వా గ్రామంలో గల కొవ్వొత్తి కర్మాగారంలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్య అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా ప్రమాదానికి గల కారణాలను తెలసుకొని తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్‌, పోలీసులను ఆదేశించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo